తుని నియోజకవర్గం తొండంగి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసీపీ పాలనలో మా గ్రామానికి 541 గృహాలను కేటాయించారు. వీటిలో కేవలం 226 మందికే ఇళ్ల స్థలాలు చూపించి చెరువులో ఇచ్చారని, వైసీపీ సానుభూతిపరులకు మాత్రమే ఇళ్లు ఇచ్చారని, మిగిలిన 313 మందికి నేటికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు. స్థానిక నాయకులు, అధికారులను అడిగినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఒంటిమామిడి గ్రామంలో సుమారు 4 కిలోమీటర్ల అవతల స్థలాలు ఏర్పాటు చేశామని చెప్పారు. నేటికీ స్థలాలు కేటాయించలేదని, అద్దె ఇళ్లల్లో ఉంటూ అవస్థలు పడుతున్నామని, మీరు అధికారంలోకి వచ్చాక ఇళ్లు లేని వారికి స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నారా లోకేష్ స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి స్కీమ్ వెనుకా ఒక స్కామ్ దాగి ఉంటోంది. పేదలకు ఆవాసయోగ్యం కాని సెంటు పట్టాలిచ్చి రూ.7వేలకోట్లు దోచుకున్నారు. ఇళ్లు కట్టుకునే వారికి బిల్లులు పెండింగ్ పెట్టి అప్పులపాలు జేస్తున్నారు. వైసీపీ వారికి మాత్రమే స్థలాలు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకపోవడం దుర్మార్గం. టిడిపి అధికారంలోకి వచ్చాక ఇల్లులేని ప్రతిపేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.