తుని నియోజకవర్గం శృంగవృక్షం గ్రామానికి చెందిన అంబేద్కర్ సంక్షేమ సేవాసంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్ధరించాలని, ఇళ్లు, స్థలాలు లేని దళితులను ఆదుకోవాలని కోరారు. దళితవాడల్లో కనీస వసతులు లేవని, కమ్యూనిటీహాలు లేదని, వైసీపీ పాలనలో దళితులపై దాడులు, హత్యలు పెరిగిపోయాయని, జగన్ రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. నారా లోకేష్ స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితుల మాన, ప్రాణాలకు రక్షణ కరువైంది. జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదికలో వెల్లడైన అంశాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దళితులపై నేరాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ నెం.1 స్థానంలో ఉంది. 2022 సంవత్సరంలో దళితులపై 2,315 దాడులు, హత్యలు చోటుచేసుకున్నాయి. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.28,147కోట్లను దారిమళ్లించి తీరని ద్రోహం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెటనే ఎస్సీలకు గత ప్రభుత్వం అమలుచేసిన 27 సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు.