ఉభయగోదావరి జిల్లాల్లో లోకేష్ కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు * ప్రజాచైతన్యంలో విజయవంతమైన లోకేష్ పాదయాత్ర * యువగళం గొంతునొక్కేందుకు విఫలయత్నాలు * పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు * ఉభయగోదావరి జిల్లాల్లో బ్రహ్మరథం
అమరావతి : ఉద్యోగాల్లోక నిరాశ,నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువత ఒకవైపు..అరాచకపాలనలో బాధితులుగా మారిన ప్రజలు మరోవైపు.. ఇంటినుంచి బయటకు వెళ్తే తిరిగి క్షేమంగా తిరిగివస్తామనే గ్యారంటీలేక భయాందోళనలతో బతుకుతున్న మహిళాలోకం ఇంకోవైపు…ఇటువంటి రాక్షసపాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 219వరోజు తుని నియోజకవర్గం తేటగుంట వద్ద 3వేల కి.మీ.ల చారిత్రాత్మక మైలురాయికి చేరుకోనుంది. ఈ ఏడాది జనవరి 27వతేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి ప్రారంభమైన యువగళం… అన్ని అవరోధాలను అధిగమించి విజయవంతంగా దూసుకుపోతోంది. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనను అంతమొందించేందుకు జనగళమే యువగళమై జెట్ స్పీడ్ తో సాగుతున్న యువగళం పాదయాత్ర యువతను మేల్కొల్పడంతో సూపర్ సక్సెస్ అయింది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టుచేసి జైలులో పెట్టిన సమయంలో అనివార్యమైన పరిస్థితుల్లో 79రోజుల విరామం మినహా 219రోజులుగా లోకేష్ జైత్రయాత్ర అవిశ్రాంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు 10 ఉమ్మడి జిల్లాలు, 92 అసెంబ్లీ నియోజకవర్గాలు, 217మండలాలు/మున్సిపాలిటీలు, 1915 గ్రామాలను స్పృశిస్తూ 219రోజులపాటు సాగిన యువనేత లోకేష్ పాదయాత్ర 3019 కి.మీ.లు పూర్తయింది. (ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పూర్తయ్యేసరికి).ఈ సుదీర్ఘ పాదయాత్రలో యువనేత లోకేష్ 70 బహిరంగసభలు, 145 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలనుంచి రాతపూర్వకంగా 1063 వినతిపత్రాలు అందగా, లక్షలాది ప్రజలు నేరుగా యువనేతను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న లోకేష్ ను కుటుంబసభ్యుడి మాదిరిగా ఆదరించి సంఘీభావం తెలియజేస్తూ జనం నీరాజనాలు పడుతున్నారు. దారి పొడవునా జనం యువనేతకు నీరాజనాలు పడుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకుంటున్నారు.యువగళం ప్రారంభమయ్యాక వివిధ రూపాల్లో దాదాపు 1.2కోట్ల మంది ప్రజలు యువనేత లోకేష్ కు కనెక్ట్ అయ్యారు.
యువగళం గొంతునొక్కేందుకు విఫలయత్నాలు : యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న అనూహ్య స్పందనతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో వైసిపి ముష్కరమూకలు, పోలీసులు కలిసి పసుపుసైనికులను రెచ్చగొట్టి తిరిగే వారిపైనే తప్పుడు కేసులు బనాయించారు. 40మంది యువగళం వాలంటీర్లను నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపారు. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నవారితోసహా 46మంది కీలకనాయకులపై తప్పుడు కేసులు పెట్టడం అధికారపార్టీలో నెలకొన్న భయానికి అద్దంపడుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువనేత ప్రచారరథం మొదలు నిలబడే స్టూల్ వరకు అన్నీ లాగేసి గొంతునొక్కే ప్రయత్నం చేశారు. యువనేత లోకేష్ ఏ మాత్రం వెన్నుచూపకుండా కోట్లాదిమంది ప్రజల గొంతుకనే తనగళంగా వినిపిస్తూ రెట్టింపు ఉత్సాహంతో ముందుకుసాగారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభం మొదలు తంబళ్లనియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 25పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇందులో యువనేత లోకేష్ పై 3కేసులు నమోదు చేశారు. ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్ తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. ఎంతలా వేధించినా, ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా క్రమశిక్షణకు మారుపేరైనా లోకేష్ నేతృత్వంలో యువగళం బృందాలు మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగుతున్నాయి. యువగళాన్ని స్వాగతిస్తూ గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు చించడం, రాళ్లు రువ్వడం, పసుపు సైనికులు తిరగబడితే పారిపోవడం వైసిపి పేటిఎం బ్యాచ్ కి అలవాటుగా మారింది.
అడ్డంకులు సృష్టించినా అడుగు ముందుకే : యాత్రను అడ్డుకునేందుకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదే లేదంటూ పట్టువదలని విక్రమార్కుడిలా లోకేష్ ముందుకు సాగుతున్నతీరు టిడిపి కేడర్ లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తూర్పుగోదావరి వరకు యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు అధికారపార్టీ చేయని కుట్రలులేవు. అయితే ఉక్కు సంకల్పంతో యజ్ఞంలా సాగుతున్న యువగళాన్ని అడ్డుకోవడం వైసిపి ముష్కరమూకల వల్లకాలేదు. చైతన్యానికి మారుపేరైన విజయవాడ వంటి నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తెల్లవారుజాము 3.30వరకు ఎదురుచూడటం యువనేత లోకేష్ పై నెలకొన్న అభిమానం, నమ్మకానికి అద్దం పడుతోంది. యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే రాష్ట్రంలో 108 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుపార్టీ విజయదుందుభి మోగించడంతో అధికారపార్టీలో ప్రకంపనలు చెలరేగాయి. లోకేష్ పాదయాత్ర ప్రజాచైతన్యంలో సంపూర్ణంగా విజయం సాధించింది. యువగళం పాదయాత్ర రాయలసీమలో చరిత్ర సృష్టించింది. గతంలో మరే నాయకుడు చేయని విధంగా రాయలసీమలో 124రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1587 కి.మీ. పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు.
ఉభయగోదావరి జిల్లాల్లో బ్రహ్మరథం : చైతన్యానికి మారుపేరైన ఉభయగోదావరి జిల్లాల్లో 17 నియోజకవర్గాల పరిధిలో 23రోజులపాటు సాగిన యువగళం పాదయాత్ర జనజాతరను తలపించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 8నియోజకవర్గాలు, 11రోజులు, 225.5 కి.మీలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 9 నియోజకవర్గాలు, 12రోజులు 178.5 కి.మీ.లు కలిపి మొత్తం 404 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర కొనసాగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 12రోజులపాటు 178 కి.మీ.ల మేర కొనసాగిన యువగళం పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. పల్లెలు, పట్టణాలని తేడా లేకుండా అన్నివర్గాల ప్రజలు యువనేతకు ఆత్మీయస్వాగతం పలికారు. రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా యువగళం ముందుకు సాగింది.
పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు : యువనేత లోకేష్ తాను పాదయాత్ర నిర్వహించే అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బహిరంగసభలు నిర్వహించి మాటల తూటాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర సాగిన 92అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70చోట్ల యువనేత లోకేష్ బహిరంగసభల్లో ప్రసంగించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో తాటిపాక (రాజోలు), ముమ్మిడివరం, కాకినాడ, తుని బహిరంగసభల్లో యువనేత లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలు, దోపిడీ విధానాలను ఎండగట్టడమేగాక, ప్రతి బహిరంగసభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తుండటంతో అధికారపార్టీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. సమాధానం చెప్పలేని అధికారపార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలతో ఎదురుదాడికి దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా నియోజకవర్గాల్లో తాము ఏంచేస్తామని స్పష్టంగా చెబుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్న తీరు ప్రజలను ఆకట్టుకుంది.
ముఖాముఖి సమావేశాలతో లోతైన అధ్యయనం : పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలపై యువనేత లోకేష్ లోతైన అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటివరకు 145 ముఖాముఖి సమావేశాలు నిర్వహించిన యువనేత క్షేత్రస్థాయిలో ఆయావర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చాక తాము ఏం చేయబోతున్నారో స్పష్టం చేస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగిలో శెట్టిబలిజ సామాజికవర్గీయులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు, టిడిపి – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదరణ పథకం ద్వారా 90 శాతం సబ్సిడీతో పనిముట్లు అందిస్తాం. ఆదరణ పథకం 2 లో మీరు కట్టిన డబ్బు ని వడ్డీతో సహా ఇస్తాం. 50 ఏళ్లు దాటిన కల్లు గీత కార్మికులకు పెన్షన్ ఇస్తాం. కల్లు గీత కార్మికులకు చంద్రన్న బీమా అమలు చేస్తాం. నీరా కేఫ్ కు ఏర్పాటు కి సహకారం తో పాటు, చెట్ల పెంపకం కోసం ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తామని భరోసా ఇచ్చారు.
సెల్ఫీ ఛాలెంజ్ తో అధికారపార్టీ ఉక్కిరిబిక్కిరి : యువగళం పాదయాత్ర దారిలో టిడిపి హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల తాలుకూ విజయగాథలు, వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ లోకేష్ విసురుతున్న సెల్ఫీ ఛాలెంజ్ లు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు – వైసీపీ పాలనలో సాగుతున్న విధ్వంసం, అవినీతిని సెల్ఫీలతో వివరిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. పాదయాత్ర సాగే సమయంలో ఎక్కడ ఎవరి బండారాన్ని లోకేష్ బయటపెడతారోనని అధికారపార్టీ శాసనసభ్యులు బిక్కుబిక్కుమంటున్నారు.
సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమానికి అనూహ్య స్పందన : ప్రతిరోజూ తనను కలవడానికి వచ్చే కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీ విత్ లోకేష్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు యువనేత లోకేష్ 3.32లక్షలమందికి పైగా అభిమానులతో ఫోటోలు దిగారు. నెల్లూరులో అత్యధికంగా ఒకేరోజు 2,500మంది యువనేతతో సెల్ఫీ దిగారు. ఈ కార్యక్రమం కారణంగా ఒకానొక సమయంలో లోకేష్ కు తీవ్రమైన రెక్కనొప్పి వచ్చింది. ఈ సమయంలో సెల్ఫీలు వద్దని వ్యక్తిగత వైద్యులు వారించిన యువనేత వినలేదు. అభిమానులను నిరాశపర్చకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. యువనేతతో సెల్ఫీ దిగిన వారి ఫోటోలను స్కానింగ్ చేయించి, ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకే చేరేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు ఫోటోలను అప్ లోడ్ చేస్తున్నారు. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంతోపాటు దారిపొడవునా తనను కలిసేందుకు వచ్చిన ఏ ఒక్కరినీ నిరాశపర్చకుండా ఓపికగా ఫోటోలు దిగుతున్నారు.
ఆకట్టుకున్న ప్రత్యేక కార్యక్రమాలు : యువగళం సందర్భంగా ప్రతిజిల్లాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు అనూహ్యస్పందన లభిస్తోంది. ఇప్పటివరకు మరే ఇతర జిల్లాల్లో లేనివిధంగా గుంటూరు జిల్లాలో 3చోట్ల యువనేత లోకేష్ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొత్తం ఇప్పటివరకు నిర్వహించిన 12 ప్రత్యేక కార్యక్రమాలకు ప్రజలనుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. యువత, మహిళలు, బిసిలు, ఎస్సీలు, రైతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో ఆయావర్గాలకు టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేయబోతున్నామో విస్పష్టంగా చెబుతున్నారు.