ఇంకెంత మంది దివ్యాంగులను బలి తీసుకుంటావు జగన్ : నారా లోకేశ్
అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నక్కనదొడ్డికి చెందిన దివ్యాంగురాలు సరోజ ఆత్మహత్య ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. సరోజ కళ్లు కనిపించవని, కళ్లుండీ ఆమె ప్రాణాలు రక్షించలేకపోయాని వైఎస్సార్సీపీ సర్కారుపై మండిపడ్డారు. ఆమె తమ్ముడికి ఉద్యోగం వచ్చిందనే కారణం చూపి ఏడాదిగా పెన్షన్ నిలిపేశారని, తనకున్న ఏకైక ఆసరా కోల్పోయాననే బెంగతో సరోజ ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. ఇంకెంత మంది దివ్యాంగులు, వృద్ధులను బలి తీసుకుంటావు సైకో జగన్ అంటూ ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. కాగా ఫించను తొలగించారనే ఆందోళనలతో అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని నక్కనదొడ్డి తండాకు చెందిన సరోజ అనే 40 ఏళ్ల అంధురాలు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పుట్టుకతో అంధురాలైన ఆమెకు చిన్నప్పటి నుంచి ఫించను వచ్చేది. అయితే ఆమె తమ్ముడికి రైల్వేలో ఉద్యోగం రావడం, అతడి పేరు కూడా రేషన్ కార్డులో ఉన్న కారణంగా ప్రభుత్వం ఫించను ఆపేసింది.
[https://bloomtimes.org/images/srilekha_/CBN.jpg]