కేటీఆర్ రాజకీయ జీవితం : 2006 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెన్నంటి నడిచారు. మొదటిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేశారు. సమీప ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010 ఉప ఎన్నికల్లో బరిలో నిలిచారు. సమీప ప్రత్యర్ధి కేకే మహేందర్ రెడ్డిపై 68,219 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 జనరల్ ఎన్నికల్లో 53,004 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తిరిగి 2018 ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు.