ముఖ్యమంత్రికి లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ : ఆంధ్రప్రదేశ్లోని 18 జిల్లాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. సీఎం, మంత్రులు పొలంబాట పట్టాలని సూచించారు. పంటలు ఎండిపోవడంతో రైతులు దిగాలుగా ఉన్నారని చెప్పారు. తక్షణమే ఏపీలో కరవు మండలాలను ప్రకటించాలని కోరారు. కరవు పీడిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించేట్లు చూడాలి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సత్వర చర్యలు చేపట్టాలని సీఎంకు రాసిన లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు.