జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సందర్శించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ : స్థానిక పశ్చిమ నియోజకవర్గంలోని 43, 45, 53, 54 డివిజన్లలో 4 సచివాలయాల పరిధిలో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సదర్శించడం జరిగిందన్నారు. అందరికీ మంచి వైద్యం చేసి చక్కటి మందులు ఇస్తున్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు కూడా భరోసా ఇస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరంతరం ప్రజా ఆరోగ్యం పై శ్రద్ధ చూపుత్తున్నారన్నారు.ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
గతంలో చంద్రబాబు ప్రవేట్ ఆసుపత్రులను పెంచి పోషించారన్నారు. నేడు ఆరోగ్య రంగానికి పెద్ద పిటవేస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. అందరికీ ఇంటి ముంగిటలో వైద్య వ్యవస్థ తీసుకొచ్చామన్నారు. నిజం గెలవాలని మేము కోరుతున్నాం. చంద్రబాబు అవినీతి చెయ్యలేదని తిరుమల వేదికగా భువనేశ్వరి చెప్పగలదా అని ప్రశ్నించారు. తప్పు చెయ్యలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు చెప్పలేక పోతున్నారన్నారు. కోట్ల రూపాయలు తీసుకునే న్యాయవాదులు కూడా చంద్రబాబు పక్షాన నిలబడ లేకపోతున్నారన్నారు. స్మశానం వద్ద కూర్చొని ఎవరు చనిపోయినా వాళ్లు చంద్రబాబు కోసమే చనిపోయారని టీడీపీ వాళ్లు లెక్కలో రాసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.పేదలకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. టీడీపీ పిలుపులకు ప్రజల స్పందన కరువైందన్నారు. ప్రజల సొమ్మును దోచుకున్న చంద్రబాబు చేత కక్కిస్తామని తెలిపారు.
టీడీపీ కి దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ మొదటే చెప్పామని తెలిపారు. నా ప్యాకేజ్ కోసం దేనికైనా రెడీ అంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు.2019 లోకూడా వీళ్లంతా ఒకటే అని చెప్పం అన్నారు. తొక్క తీస్తాం అనే మాటలు ఏమయ్యాయనీ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు. నా లాభం కోసం దేనికైనా రెడీ అంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని దుయ్యబట్టారు. ఎక్కడ ఎన్ని సమావేశాలు పెట్టుకున్న ఏమి అవ్వదు అని అన్నారు. పవన్ కళ్యాణ్ , చంద్రబాబు, లోకేష్ ని చిత్తు చిత్తుగా ప్రజలు ఒడిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు బాపతి కోటిరెడ్డి, మైలవరపు మాధురి లావణ్య, మహాదేవు అప్పాజీరావు, అర్షద్ అకిబ్ తదితర కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు, నగర పాలక సంస్థ, సచివాలయం సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.