కర్నూలు : కర్నూలు జిల్లా ను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఆలూరు మండలం హూలెబీడు గ్రామ పోలాలులో వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలూరులో మంత్రి జయరాం ఉండి కూడా పంట పొలాలను పరిశీలించకపోవడం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లాకు వచ్చి బటన్ నొక్కి వెళ్లాడు. ఉమ్మడి జిల్లాల మంత్రులు కరువుపై ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు. రైతుల సమస్యలు ముఖ్యమంత్రికి, మంత్రులకు పట్టలేదా..? గత రెండు రోజులుగా పంట పొలాలను పరిశీలించినప్పుడు అన్ని పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు పూర్తిగా నష్టపోయారని, వెంటనే ప్రభుత్వం ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సీపీఐ పార్టీ ఆందోళనలు చేపడుతుందని రామకృష్ణ తెలిపారు.