వైఎస్సార్ వాహన మిత్ర పథకం అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నా
వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్ అంటే పేదల గొంతుకై నిలబడిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
విజయవాడ : త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి,
పేదలను వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగబోతుందని తెలిపారు.పేదలకు,
పెత్తందారులకూ మధ్య యుద్ధం జరగనుందని పేర్కొన్నారు. అమరావతి పేరుతో స్కామ్,
స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, నీరు-చెట్టు పేరుతో
దోపీడీ చేసిన వారితో యుద్ధం జరగబోతుందని మండిపడ్డారు. విజయవాడలో వరుసగా అయిదో
ఏడాది వాహనమిత్ర నిధులను సీఎం జగన్ శుక్రవారం విడుదల చేశారు. వాహనమిత్రతో ఆటో
డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు లబ్ధి పొందుతుండగా 2,75,931 మంది ఖాతాల్లోకి
రూ. 10 వేల చొప్పున జమచేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ 99శాతం హామీలు అమలు
చేశామని తెలిపారు. మన ప్రభుత్వం వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ అని
పేర్కొన్నారు. ఒకవైపు పేదల ప్రభుత్వం ఉంటే మరోవైపు పేదల్ని మోసగించిన వారు
ఉన్నారని విమర్శించారు.
ఇది జగనన్న ప్రభుత్వం కాదని, ఇది మీ అందరి ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆటోడ్రైవర్లు అందించిన ఖాకీ చొక్కా
ధరించిన సీఎం జగన్ ప్రసంగం ప్రారంభించారు. బతుకు బండి లాగడానికి ఆటో,
ట్యాక్సీ డ్రైవర్ల కోసమే ఈ పథకం అని సీఎం జగన్ పేర్కొన్నారు. వాహనం
ఇన్యూరెన్స్, ఇతర ఖర్చుల కోసమే వైఎస్సార్ వాహన మిత్ర. ఆటో,ట్యాక్సీ
డ్రైవర్లకు అండగా నిలిచేందుకే ఈ పథకం. ఇవాళ రూ.276 కోట్ల రూపాయలు జమ
చేస్తున్నాం. వైఎస్సార్ వాహన మిత్రతో ఒక్కొక్కరికీ రూ.50 వేలు లబ్ది
జరుగుతోంది. వైఎస్సార్ వాహన మిత్ర పథకం అమలు చేస్తున్నందుకు
గర్వపడుతున్నానన్నారు.
మీ వాహనాలకు ఇన్స్యూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉంచుకోండి. ఎంతోమంది
ప్రయాణికులకు మీరు సేవలందిస్తున్నారు. జగనన్న సురక్ష ద్వారా అవసరమైన
సర్టిఫికేట్లు ఇంటికే అందిస్తున్నాం. పథకాలన్నీ అత్యంత పారదర్శకంగా అమలు
చేస్తున్నాం. అవినీతికి తావులేకుండా పథకాలను అందిస్తున్నాం. వలంటీర్
వ్యవస్థతో పాలనను ప్రజలకు చేరువ చేశాం. ఆర్బీకేలతో రైతులకు అండగా నిలిచాం.
పాదయాత్రలో మీ అందరి కష్టాలు చూశా. మీ సమస్యలకు పరిష్కారంగా సంక్షేమ పథకాలు
అమలు చేస్తున్నాం. రైతన్నకు రూ.30,985 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా సాయం.
మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచాం. వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్ అంటే పేదల
గొంతుకై నిలబడిన ప్రభుత్వం.
చిరు వ్యాపారులకు రూ.2,956 కోట్లు సాయం అందించామని సీఎం జగన్ మోహన్ రెడ్డి
వెల్లడించారు. పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మనది. వైఎస్సార్
కాపునేస్తంతో రూ.2,029 కోట్లు సాయం అందించాం. వైఎస్సార్ ఈబీసీ నేస్తంతో
రూ.1257 సాయం అందించాం. గత పాలకులకు మనసు లేదు. నిరుపేదల వైపు నిలబడిన
ప్రభుత్వానికీ, నిరుపేదలను వంచించిన గత ప్రభుత్వానికీ మధ్య యుద్ధం.
మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని అమలు చేశాం. ఎన్నికల మేనిఫెస్టోను
చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని పేర్కొన్నారు.
మన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం. గత పాలకులకు మనసు లేదు. పేదల కోసం
పనిచేస్తున్న ప్రభుత్వం మనది. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని అమలు చేశాం.
మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. లంచం, వివక్ష
లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేశాం. గతంలోనూ ఇదే బడ్జెట్,
మారిందల్లా సీఎం ఒక్కడే.గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారు? అని
ప్రశ్నించారు. పేదవాడి ప్రభుత్వం నిలబడాలి. పెత్తందారుల ప్రభుత్వం రాకూడదు.
వచ్చే ఎన్నికలప్పుడు వీటన్నింటి గురించి ఆలోచించాలని సూచించారు. వాళ్లకు
అధికారం కావాల్సింది దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి.. వాళ్లలాగా
నాకు దత్తపుత్రుడి తోడు లేదు. వాళ్లు మాదిరిగా నాకు గజదొంగల ముఠా తోడుగా లేదు.
దోచుకొని పంచుకొని తినడం నా విధానం కాదు. మీ ఇంట్లో మంచి జరిగిందనిపిస్తే నాకు
తోడుగా నిలవండి. ఈ కురుక్షేత్ర యుద్ధంలో నాకు అండగా నిలబడండి. ఓటు వేసే ముందు
జరిగిన మంచి గురించి ఆలోచించండని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.