వెలగపూడి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందస్తు బెయిల్
పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు
ఎలైన్మెంట్ వ్యవహారంపై గతేడాది నమోదుచేసిన కేసులో ఏ14గా ఆయన పేరును సీఐడీ
ఇటీవల చేర్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు
బెయిల్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం
తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేశ్‌కు
41ఏ నోటీసులు ఇస్తామని, దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని కోర్టుకు
తెలిపారు. 41ఏ నోటీసులు అంటే అరెస్ట్ ప్రస్తావన రానందున.. ముందస్తు
బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.