విజయవాడ : అక్టోబర్ 1వ తేదీ ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే
రెవెన్యూ ఉద్యోగుల 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంను జయప్రదం చేయాలని
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,
చేబ్రోలు కృష్ణ మూర్తి కోరారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్
అధ్వర్యంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన రెవెన్యూ కౌన్సిల్ సమావేశం
2017 లో 16 వ సమావేశం జరిగింది. 2020 లో జరగాల్సిన 17వ రెవెన్యూ కౌన్సిల్
సమావేశం కరోనా తీవ్రత దృష్ట్యా జరగలేదు. కనుక దాదాపు 6 సంవత్సరాల విరామం
తర్వాత ఏపీ రెవెన్యూ అసోసియేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని అక్టోబర్ 1న
ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నామని, ఈ కౌన్సిల్
సమాశానికి అధిక సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ సహాయకుడు నుండి
డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉన్న రెవెన్యూ ఉద్యోగులు అందరూ తరలి వచ్చి
జయప్రదం చేయాలని ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు
పిలుపునిచ్చారు.