ఏలూరు : సీఎం జగన్ కు ఎన్నికల భయం పట్టుకుందని మాజీ మంత్రి పీతల సుజాత
ఆరోపించారు. గురువారం ఆమె ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ కు ఎన్నికల
భయం పట్టుకుందని, మొన్నటివరకు ‘వై నాట్ 175’ అన్నముఖ్యమంత్రి ఇప్పుడు
సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామందికి టిక్కెట్లు ఇవ్వనంటున్నారని, ఎన్నికల
భయంతోనే మీటింగులు పెడుతూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు
కుటుంబ సభ్యులపై వైసీపీ నేతల విమర్శలు తగదన్నారు. జగన్ జైలులో ఉన్నప్పుడు
షర్మిల, విజయలక్మి , భారతీలు జగన్ కోసం ఆరాటం పడలేదా? అని ప్రశ్నించారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉప్పుడు వారి కుటుంబ సభ్యులు
రోడ్డుపైకి వచ్చారని, ఇప్పుడు చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి జైల్లో
పెట్టారని, బాబు కోసం ఆయన కుటుంబ సభ్యులు బయటికి వస్తే తప్పేంటని పీతల సుజాత
ప్రశ్నించారు. మంత్రి రోజా మానసిక పరిస్థితి బాగుందో లేదో ఒకసారి చెక్
చేసుకోవాలని సూచించారు. రోజాకు మైండ్ దొబ్బింది కాబట్టే ఏది పడితే అది
మాట్లాడుతున్నారని, పదవి చూసుకుని విర్రవీగుతున్నారని మండిపడ్డారు. వైసీపీ
పేటీఎం బ్యాచ్ మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, దాన్ని తీవ్రంగా
ఖండిస్తున్నామన్నారు. ప్రజా క్షేత్రంలో జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బుద్ధి
చెబుతారని పీతల సుజాత అన్నారు.