టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
విజయవాడ : ఏదైనా నేరం జరిగితే పోలీసు వ్యవస్థ తగిన సాక్ష్యాధారాలు సేకరించిన
తర్వాత సంబంధిత ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టుకు పంపుతారని టీడీపీ పొలిట్
బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. న్యాయస్థానం పోలీసులు ప్రవేశపెట్టిన
సాక్ష్యాలు పరిగణనలోకి తీసుకుని ముద్దాయిని జ్యుడీషియల్ కస్టడీ (రిమాండ్)కి
పంపుతుందని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ఏ తప్పూ
చేయకపోయినా, ఏ సాక్ష్యాధారాలు లేకపోయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి కక్ష గట్టి తాను
ఏ విధంగా చంచల్ గూడ జైల్లో 16 నెలలు రిమాండు ఖైదీగా జైలు జీవితం గడిపారో అదే
విధంగా చంద్రబాబు కూడా 16 రోజులైనా జైలు జీవితం గడపాలని అమాయకుడైన సీఐడీ
అధిపతి ఎన్.సంజయ్‌పై ఒత్తిడి తెచ్చి వ్యక్తి గత కారణాలతో బెదిరించి చంద్రబాబు
ని తప్పుడు కేసులో అరెస్టు చేయించి ఈ నాటికి 19 రోజులుగా రాజమండ్రి సెంట్రల్
జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచడం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కక్ష సాధింపులో
భాగమేనని స్పష్టం చేశారు.