రాజమహేంద్రవరం : కనీస ఆధారాలు లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు
పెట్టారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబును తప్పుడు
కేసులో ఇరికించి జైలులో పెట్టారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి
రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్న చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ
నాయకులు కలిశారు. ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితోపాటు
అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు ములాఖత్ ద్వారా కలిసి మాట్లాడారు.
ఏదైనా కేసుపెట్టాలంటే కనీస ఆధారాలు ఉండాలి. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేకుండా
అరెస్టు చేశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. చంద్రబాబును రెండ్రోజులపాటు
ప్రశ్నించారు. ఏమైనా ఆధారాలు దొరికాయా? అంటే సమాధానం లేదు. దేశరాజకీయాల్లో
చక్రం తిప్పిన నాయకుడిపై నమోదు చేశారు. అరెస్టు చేసిన తర్వాత ఆధారాలు
సంపాదిస్తామనడం సరికాదు. ఈ ప్రభుత్వం వాస్తవాలు ప్రజలకు తెలియనివ్వడం లేదు.
కస్టడీలో మొత్తం 33 ప్రశ్నలు వేశారు. పనికిమాలిన సంబంధంలేని ప్రశ్నలు అడిగారు.
చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారు. మమ్మల్ని కూడా చాలా ధైర్యంగా పోరాటం
చేయమన్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. కానీ ఆయన భద్రతపై మాకు భయంగా ఉందని
అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ప్రభుత్వం డీఐజీ మీద కూడా నిఘా పెట్టిందని అచ్చెన్న
పేర్కొన్నారు. జైలులో చంద్రబాబుకు ఏమైనా జరిగితే దానికి కర్త, కర్మ, క్రియ
మొత్తం జగనే. యువగళానికి మళ్లీ అనుమతులు తీసుకుంటున్నాం. మరో వారం రోజుల్లో
పాదయాత్ర ప్రారంభిస్తాం. జనసేనతో కలిసి పని చేయాలని టీడీపీ క్యాడర్లకు
ఆదేశాలిచ్చాం. అరెస్టులకు భయపడే వాళ్లం కాదు. అన్ని సర్వేలు చంద్రబాబుకే
అనుకూలంగా ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. రాష్ట్రం బాగుకోసం
పోరాటమే ఏకైక మార్గం. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ యువత రోడ్డెక్కింది.
ఉద్యమాన్ని అణచివేయాలని పోలీసులు చూస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు.