కాకినాడ : జగ్గంపేటలో మహిళల రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజేయడానికి
విచ్చేసిన నారా భువనేశ్వరి, ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ
ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ చంద్రబాబు అక్రమ అరెస్టు
నిరసిస్తూ ఆయనకు మద్దతుగా లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని ఆ
కరపత్రాలను నారా భువనేశ్వరి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం మొట్టమొదటి
సంతకం పెట్టి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. నియోజకవర్గ
వ్యాప్తంగా విచ్చేసిన వేలాది మహిళలను ఉద్దేశించి నెహ్రూ మాట్లాడుతూ ఈ సైకో
జగన్ రెడ్డి ప్రతిపక్షాల గొంతు నోక్కలనే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు అక్రమ
అరెస్టు జరిగిందని తన భర్త కోసం ఎప్పుడూ రాజకీయాలకు సంబంధం లేకుండా తన వ్యాపార
వ్యవహారాలను చూసుకునే భువనేశ్వరి ఈరోజు ఇలా తిరగవలసిన పరిస్థితి తీసుకొచ్చారని
దీనిపై అందరూ పోరాడాలని అన్నారు. జగన్ రెడ్డితోను, చంద్రబాబుతోను ఆయన పని
చేసిన అనుభవాలను గుర్తు చేస్తూ జగన్ ప్రజలను దో సుకోవాలని దాచుకోవాలని
సలహాలిస్తుంటారని చంద్రబాబు తప్పు చేసిన వారి ఎంతటి వారినైనా ఉపేక్షించడానికి
వారిద్దరికీ తేడాలను ఆయన వివరించారు.