సీఐడీ విచారణ సందర్భంగా వైద్య పరీక్షల నిర్వహణపై జడ్జి ఆరా
నేడు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపడతామన్న న్యాయమూర్తి
వర్చువల్‌గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన అధికారులు
చంద్రబాబు రిమాండ్‌ను మరో 11 రోజులు పొడిగించిన న్యాయమూర్తి
విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ను అక్టోబరు 5వరకు పొడిగిస్తూ
న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రెండ్రోజుల సీఐడీ
కస్టడీ, రిమాండ్ ముగియడంతో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆన్లైన్
ద్వారా విచారణ చేపట్టారు. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని సీఐడీ అధికారులు
కోరగా అక్టోబరు 5వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు
రెండ్రోజుల సీఐడీ కస్టడీ ముగిసిన తరువాత రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచే
వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. ‘‘విచారణ సందర్భంగా సీఐడీ
అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? ఏమైనా
అసౌకర్యం కలిగిందా? వైద్య పరీక్షలు చేయించారా? అని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి
చంద్రబాబును ప్రశ్నించారు. విచారణలో అధికారులు ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు
జడ్జికి చెప్పారు. విచారణ అనంతరం చంద్రబాబు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు
జారీ చేశారు.
మీ బెయిల్ పిటిషన్‌ను సోమవారం విచారిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబుతో
ఏసీబీ న్యాయమూర్తి చెప్పారని తెలుస్తోంది. ఈ రోజు కస్టడీ, రిమాండ్ ముగిసిన
నేపథ్యంలో సీఐడీ అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట
హాజరుపరిచారు. రెండురోజుల కస్టడీ ముగియడంతో విచారణ అధికారులను అక్కడి నుంచి
వెళ్లిపోవాలని ఆదేశించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ రేపు బెయిల్
పిటిషన్‌పై విచారణ జరుపుతున్నట్లు చెప్పారని తెలుస్తోంది. విచారణ సమయంలో వైద్య
పరీక్షలు నిర్వహించారా? ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని న్యాయమూర్తి
ప్రశ్నించారు. వైద్య పరీక్షలు నిర్వహించారని, తనను ఏవిధంగా ఇబ్బంది పెట్టలేదని
చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి జడ్జి మాట్లాడుతూ సోమవారం
బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామన్నారు. విచారణ సందర్భంగా ఏం గుర్తించారో
బయట పెట్టాలని ఈ సందర్భంగా చంద్రబాబు విజ్ఞప్తి చేయగా, న్యాయమూర్తి స్పందిస్తూ
వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను మీ న్యాయవాది నుంచి తీసుకోవాలని జడ్జి
సూచించారు.