నరసన్నపేట : రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే గ్రహించిన చంద్రబాబు
నాయుడు, అతని కుమారుడు లోకేష్ శవరాజకీయాలు చేసైనా లబ్దిపొందడానికి తాపత్రయ
పడుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. ఈమేరకు
శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనం ఛీకొడుతున్నా వాళ్లకు బుద్ది రాలేదని
విమర్శించారు. లోకేష్ పాదయాత్రలో సంఘవిద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు యువగళం
పేరుతో ఎర్ర టీషర్టుల ముసుగులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దాడులకు
తెగబడుతున్నారనీ, భీమవరం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రశాంతంగా ఉన్న
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, కులాల్ని, మతాలను రెచ్చగొట్టి ప్రజలు ఆ
మంటల్లో కాలిపోతే ఆ మంటల్లో రాజకీయంగా చలి కాచుకోవాలన్నదేనని వారి తాపత్రయమని
తెలిపారు. ప్రతిపక్షాల కల నెరవేరదని, హింసను ప్రేరేపిస్తే జగన్ మోహన్
రెడ్డి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించదని కృష్ణదాస్ హెచ్చరించారు.