విజయవాడ : కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో, కే జి బివి లలో గతంలో
పనిచేస్తున్న( పిజిటి& సి.ఆర్.టి) ఉపాధ్యాయులు, అధ్యాపకులను తిరిగి విధుల్లో
కొనసాగించాలని జై భీమ్ దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు ఆదాడి మల్లికార్జునరావు
డిమాండ్ చేశారు. నూతనంగా ఇచ్చిన నోటిఫికేషన్ లో గతంలో చేసిన గెస్ట్
ఫ్యాకల్టీలను పిజిటి ,సిఆర్టి లను కొనసాగిస్తూ కొత్తవారిని మిగిలిన ఖాళీలలో
భర్తీ చేయాలని కోరారు. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ లో జరిగిన ధర్నాలో జై
భీమ్ దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు ఆదాడి మల్లికార్జునరావు మాట్లాడుతూ తెలుగు
ఇంగ్లీష్ ఫ్యాకల్టీ లను, క్రమబద్ధీకరణ చేసి తిరిగి వారి ఉద్యోగాలు వారికి
ఇవ్వాలని కేజీబీవీ లలో గెస్ట్ ఫ్యాకల్టీ లను (పిజిటి, సి ఆర్ టి) లను
కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగిస్తూ తద్వారా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లుగా ఏడు సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ ద్వారా, డెమో
వెరిఫికేషన్ ,సర్టిఫికెట్ వెరిఫికేషన్, ద్వారా పద్ధతి ప్రకారం సెలెక్ట్ అయి
విధుల్లో ఉన్నవారని, ఇప్పడు నోటిఫికేషన్లు 1500 మందికి ఉద్యోగాలు ఇస్తున్నట్టు
ప్రకటించారని, అందరూ కొత్తవారికి, 950 మంది ఏడు సంవత్సరాల నుంచి
చేస్తున్నప్పటికీ విధుల్లోకి తీసుకోలేదన్నారు. రాత్రికి రాత్రి
రిక్రూట్మెంట్ , అపాయింట్మెంట్, జాయినింగ్ ఆర్డర్, చేసి కొత్తవారికి
ఇచ్చారని, ఇందులో అవినీతి లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ
విషయంపై స్పందించక పొతే ఆమరణ నిరాహార దీక్ష లేదా సీఎం ఈల్లు ముట్టడి కి
పిలుపునిస్తూ కార్యచరణ చేసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం. రాజేశ్వరి,
నవభారతి, రేష్మ, స్వప్న కుమారి, శ్రీలక్ష్మి, సి.అంకమ్మ, ఎస్.అనిత ,పి. ఝాన్సీ
, తదితరులు పాల్గొన్నారు.