వాషింగ్టన్ : తొలిసారిగా అమెరికా శ్వేతసౌధంలో అంగరంగ వైభవంగా దీపావళి రిసెప్షన్ వేడుకలు నిర్వహించారు. చరిత్రోలో మునుపెన్నడూ లేనంతగా వైట్ హౌస్‌లో అత్యధిక సంఖ్యలో ఆసియా అమెరికన్లు ఉండటం విశేషం. అదీగాక బైడెన్ పరిపాలనో అధిక సంఖ్యలో భారతీయ అమెరికన్లు ఉన్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లాడుతూ మీకు ఆతిథ్యం ఇవ్వడం మాకు గౌరవంగా ఉంది. వైట్‌హౌస్‌లో ఈ స్థాయిలో దీపావళి రిసెప్షన్‌ని నిర్వహించడం ఇదే తొలిసారి.
ఈ దీపావళి వేడుకను ఆమెరికా సంస్కృతిలో భాగం చేసినందుకు ధన్యవాదాలు. యూఎస్‌లో ఉన్న బిలియన్కు పైగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి వేడుకను ఆనందంగా జరుపుకున్నందుకు యూఎస్‌లోని ఆసియా అమెరికన్ కమ్యునిటీకి బైడెన్ కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు ఈ పండుగ సందర్భంగా దియాలను వెలిగించడం సంతోషంగా ఉంది. ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడేల ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేలా అమెరికా అంతటా ఉన్న దక్షిణాసియా అమెరికన్లు కనబర్చిన తెగువ, సాహసాలకు కృతజ్ఞతలు. ఈ దీపావళి వేడుక చీకటిపై వెలుగు సాధించిన గుర్తుగా ఈ పండుగను జరుపకుంటున్నాం. అలాగే ఈ వేడుకతో అమెరికా తోపాటు ప్రపంచమంతా జ్ఞాన కాంతుల వెలుగుతో నింపుదాం అని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ మాట్లాడుతూ ఈ వైట్‌హౌస్ ప్రజల ఇల్లు, మా అధ్యక్షురాలు, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో కలిసి ఈ సంప్రదాయ వేడకను జరుపకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే జిల్ బైడెన్ కూడా ఆసియా అమెరికన్ కమ్యూనిటీ మరితం ముందుకు వెళ్లేందుకు ఈ దీపావళి పండుగ సహకరిస్తోంది. అందర్నీ ఒకచోటకు చేర్చి సమానత్వాన్ని గుర్తు చేసేలా చేసుకునే పండుగా అని కొనియాడారు.