సౌదీ : సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) భారత్‌కు రానున్నారు. జీ20 సదస్సుల్లో పాల్గొనేందుకు వెళుతూ మార్గం మధ్యలో భారత్‌ను సందర్శించనున్నారు. నవంబర్ 14వ తేదీ ఉదయం ఆయన భారత్‌కు చేరుకొని ఆ రోజు సాయంత్రం జీ20 సదస్సు నిమిత్తం ఇండోనేషియాలోని బాలికి వెళ్లనున్నారు. గత నెల ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ద్వారా సల్మాన్‌కు ఆహ్వానం పంపించారు. తాజాగా సౌదీ రాజు భారత్‌లో పర్యటిస్తే ఏషియన్, ఈస్ట్ ఏషియన్ సమ్మిట్, కంబోడియా నేతలతో సమావేశాలు జరగడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. రష్యా యుద్ధంతో చమురు రంగంలోని పరిస్థితులపై ప్రధాని మోదీ- యువరాజు సల్మాన్ చర్చించే అవకాశాలున్నాయి.
2019లో భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులపై సౌదీ యువరాజు హామీ అమలు కూడా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల సౌదీ అరేబియా ఇంధనశాఖ మంత్రి అబ్దుల్జీజ్ బిన్ సల్మాన్ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఇంధన వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌లతో భేటీ అయి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చంచారు. ఇటీవల ఒపెక్+ దేశాలు చమురు ఉత్పత్తిలో కోత విధించాలని నిర్ణయించడంతో సౌదీ-అమెరికా మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ భారత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది.